ఫోర్స్ మోటార్స్ నికర లాభాల్లో 3 శాతం క్షీణత

అయితే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర అమ్మకాలు మాత్రం 54.93 శాతం పెరిగి రూ. 1,480.45 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నికర అమ్మకాలు రూ. 955.55 కోట్లుగా ఉన్నాయి. కాగా.. కంపెనీ బోర్డు రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై రూ.5 డివిడెండ్ ప్రకటించింది. స్మాల్ కమర్షియల్ వెహికల్స్(ఎస్‌సీవీ), మల్టీ యుటిలిటి వెహికల్స్ (ఎమ్‌యూవీ), లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సీవీ), వ్యవసాయ ట్రాక్టర్లు, హెవీ కమర్షియల్ వెహికల్స్ (హెచ్‌సీవీ) సెగ్మెంట్లలో వాహనాలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








