రాష్ట్ర మార్కెట్లో ఫోర్స్ వన్‌ను ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

కాగా.. ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కోసం కంపెనీ హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఓ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియాలు ప్రారంభించారు. ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 2148 సీసీ ఇన్‌లైన్-ఫోర్ డీజిల్ ఇంజన్ 138 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 32 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతం ఫోర్స్ వన్ ఎస్‌యూవీ టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. త్వరలో ఇందిలో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్‌యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. రాష్ట్ర విపణిలో ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ధర రూ.10.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఫోర్స్ మోటార్స్ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








