ఫిగోకు మరిన్ని అదనపు ఫీచర్లు జోడించిన ఫోర్డ్

Ford Figo
ఫోర్డ్ అందిస్తున్న చిన్న కారు ఫిగోకు ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. ఏంటా అనుకుంటున్నారా..? ఫోర్డ్ ఫిగో ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో లభ్యం కానుంది. చిన్న కార్ సెగ్మెంట్లో హోండా బ్రయో, టొయోటా ఎతియోస్ లివా, రీనాల్ట్ పల్స్, హ్యుందాయ్ ఇయాన్ వంటి కొత్త కొత్త కార్లు విడుదల అవుతుండంస మార్కెట్లో పోటీతత్వ వాతావరణం పెరుగుతుండంతో ఫిగోకు ఫోర్డ్ కొన్ని అదనపు హంగులను జోడించింది.

తక్కువ మెయింటినెన్స్, మంచి ఇంజన్, గుడ్ లుకింగ్‌తో ఫోర్డ్ ఫిగో అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న కారుగా మార్కెట్లో సాగిపోతుంది. అయితే, ఈ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు ఫిగో హ్యాచ్‌బ్యాక్‌కు ఫోర్డ్ మూడు అదనపు ఫీచర్లను జోడించింది. ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ అదనంగా అందిస్తున్న ఫీచర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

* జెడ్ఎక్స్ఐ, టైటానియం వేరియంట్లలో టిల్ట్ స్టీరింగ్
* జెడ్ఎక్స్ఐ, టైటానియం వేరియంట్లలో మ్యూజిక్ సిస్టమ్ కోసం యూఎస్‌బి పోర్ట్
* టైటానియం వేరియంట్లో అల్లాయ్ వీల్స్

బహుశా ఫోర్డ్ ఫిగోలో అప్‌గ్రేడెడ్ లేదా రిఫ్రెష్డ్ వేరియంట్‌ను 2014 వరకూ ఫోర్డ్ ఇండియా విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఫిగో మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు ఫిగోకు కంపెనీ ఈ అదనపు ఫీచర్లను జోడించనట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ ఫిగో మోడళ్లో ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ఫోర్డ్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2011, 17:04 [IST]
English summary
It would be a lie if we say Ford has been been successful in India without the help of the Figo. In fact the Figo can be credited with improving Ford's image as well as sales within a short span of time. The Figo has achieved so much thanks to its responsive engine, good looks and low maintenance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+