జెనీవా మోటార్ షోలో ఫోర్డ్ కొత్త కారు 'బి-మ్యాక్స్' ఆవిష్కరణ

Ford B-Max
జెనీవాలో జరుగుతున్న "81వ జెనీవా మోటార్ షో" ఆటోమొబైల్ రంగంలో కొత్త వింతలు, ఆవిష్కరణలకు తెరలేపుతుంది. ఇక్కడ జరుగుతున్న షోలో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ తమ నూతన ఉత్పాదనలను, టెక్నాలజీలను, కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించి ఔరా అనిపించుకుంటున్నాయి. ఈ కోవలనే అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ తమ కొత్త కాంపాక్ట్ కారు "ఎమ్‌పివి బి-మ్యాక్స్"ను జెనీవా మోటార్ షోలో విడుదల చేసింది.

ఫోర్డ్ కంపెనీ అందిస్తున్న అత్యంత ప్రాచుర్యమైన సెడాన్ మోడల్ 'ఫియస్టా' ఫ్లాట్‌ఫామ్‌పై ఈ బి-మ్యాక్స్ కారును రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. 1.0 లీటర్ పెట్రోల్ 3-సిలిండర్ టర్బో ఇంజన్‌తో ఐదుగురు (డ్రైవర్‌తో కలిపి) సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఈ కారును తీర్చిదిద్దారు. ఆటో స్టార్ట్-స్టాప్ ఆప్షన్, ట్విన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కామ్ టైమింగ్, డైరెక్ట్ ఇంజెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేయడం ఈ కారు మరో ప్రత్యేకత. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి స్థాయిలో ఉందని, వాణిజ్యపరంగా త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, March 3, 2011, 13:21 [IST]
English summary
Sensing the s excellent market potential for the coming years among the small cars, Ford has unveiled its compact MPV B-Max at the Geneva Motor Show recently. Ford is designing this car on Fiesta platform with the power from 3-cylinder turbo 1.0 lit engine. This car will be 5-seater to be a novel method in compact MPVs, petrol version, auto start-stop option, twin independent variable cam timing, direct injection, and is capable of delivering less carbon emission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+