రెండో ప్లాంటు ఏర్పాటుకు గుజరాత్‌ను ఎన్నుకున్న ఫోర్డ్

ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వంతో ఫోర్డ్ ఇండియా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టాటా మోటార్స్ చిన్న కారు నానో ప్లాంటు సరసనే ఫోర్డ్ కూడా తన రెండో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. అహ్మదాబాద్ టౌన్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న సనంద్‌లో రూ. 4,000 కోట్లు (100 కోట్ల అమెరికన్ డాలర్ల) పెట్టుబడితో ఫోర్డ్ ఈ ప్లాంటును నిర్మించనుంది. 1995లో చెన్నైలో ప్లాంటు ఏర్పాటు ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన ఫోర్డ్ తాజా పెట్టుబడితో కలిపి 200 కోట్ల డాలర్లకు చేరింది.
సనంద్‌లో 460 ఏకరాలకు పైగా స్థలంలో ఫోర్డ్ స్థాపించనున్న తన రెండో ప్లాంటులో ప్రారంభంగా సాలీనా 2.40 లక్షల కార్ల ఉత్పత్తిని మరియు 2.70 లక్షల ఇంజన్‌ల ఉత్పత్తిని చేపట్టనుంది. గుజరాత్ ప్రభుత్వంతో కుదిరిన సహకార ఒప్పందం (ఎమ్ఓయూ)లో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను మాత్రం ఫోర్డ్ వెల్లడించడానికి నిరాకరించింది.


Click it and Unblock the Notifications








