ఫోర్డ్ ఫిగో భారత యాత్ర: 100 రోజులు - 1,000 నగరాలు

Ford Figo
ఫోర్డ్ ఇండియా ముద్దుల కారు 'ఫిగో' ఇకపై రోడ్డెక్కనుంది. ఫోర్డ్ ఫిరో హ్యాచ్‌బ్యాక్ కారు లక్ష యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలను (డీలర్లు డెలివరీ చేసివి) పురస్కరించుకొని కంపెనీ 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 1,000 నగరాల్లో రోడ్‌షో నిర్వహించనుంది. తమ రోడ్‌షో ఫోర్డ్ ఫిగో 'భారత యాత్ర' ద్వారా కంపెనీ ఈ కారును మరింత మంది భారతీయ డ్రైవర్లకు పరిచయం చేయనుందని, దీని ద్వారా ఈ కారు గురించి వారు మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) నీగెల్ వార్క్ తెలిపారు.

కలకత్తాలో ప్రారంభమైన ఈ రోడ్‌షో పష్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, బీహార్, జార్ఖండ్, మాహారాష్ట్రలలో కొనసాగుతుందని, రెండు ఫిగో కాన్వాయ్‌లు పూణే, బెంగుళూర్ తదితర నగరాల్లో పర్యటిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, మరో మూడు ఫిగో కాన్వాయ్‌లు 18 రాష్ట్రాలను కవర్ చేయనున్నాయి. ఫోర్డ్ ఫిగో భారత యాత్ర గడ్చిరోలీ, హింగన్‌హత్, కోర్బా వంటి మారుమూల పట్టణాలకు కూడా చేరుకునే ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు కంపెనీ వివిరించింది.

More from DriveSpark

Article Published On: Friday, July 1, 2011, 12:06 [IST]
English summary
To celebrate one lakh unit wholesale sales (deliveries to dealer) of the Figo hatchback, Ford India has embarked on a 100-day roadshow across 1,000 cities in India. Nigel Wark, Executive Director, Marketing, Sales and Service, Ford India said that through our roadshow, the Ford Figo ‘Bharat Yatra', the company will introduce the vehicle to more Indian drivers, enabling them to see, first hand, what the buzz is all about.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+