డీజిల్ ఫ్లాట్‌ఫామ్ కార్లపై మరింత విశాల దృష్టి: ఫోర్డ్ ఇండియా

రానున్న ఉత్పత్తులన్నీ ముఖ్యంగా ప్లాట్‌ఫామ్‌పైనే ఉంటాయని, అయితే డీజిల్ కార్లను తయారు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఇది సంస్థపై ఒత్తిడిని తెస్తుందని వార్క్ తెలిపారు. గతేడాదిలో తాము 83,000 యూనిట్లు విక్రయించామని, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 58,000 యూనిట్లు విక్రయించినట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ఖచ్చితంగా లక్ష కార్ల మార్కును చేరుకుంటామని వార్క్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ కన్నా వేగంగా ఫోర్డ్ ఇండియా విస్తరణ కార్యక్రమాలు చేపడుతుందని, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ 17 శాతం చొప్పున పెరుగుతోందని ఆయన అన్నారు. ఫోర్డ్ కార్ల అమ్మకాలలో ఎక్కువ భాగం చిన్న కార్లే ఉన్నాయి. ఫోర్డ్ ముద్దుల కారు ఫిగో 50 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వార్క్ తెలిపారు.


Click it and Unblock the Notifications








