జనవరిలో 3 శాతం ధరలు పెంచనున్న ఫోర్డ్ ఇండియా

కాగా.. జపాన్ ఆటో దిగ్గజం టొయోటా కిర్లోస్కర్ కూడా తమ ఉన్న రకాల ఉత్పత్తుల ధరలను 3 శాతం మేర పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న కమోడిటీల ధరలు, రూపాయి విలువ క్షీణతల కారణం ధరలు పెంచక తప్పడం లేదని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) నైగేల్ వార్క్ తెలిపారు.
ప్రస్తుత సంవత్సరంలో ఫోర్డ్ ఇండియా ఇప్పటి వరకు మూడు సార్లు ధరలు పెంచింది. భారత మార్కెట్లో ఫోర్డ్ అందిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫిగో ధరలు రూ.3.71 లక్షల నుండి రూ.5.73 లక్షల మధ్య ఉండగా, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ సెడాన్ ధరలు రూ.5.50 లక్షల నుండి రూ.8.20 లక్షల మధ్యలోనూ, సరికొత్త గ్లోబల్ ఫియస్టా సెడాన్ ధరలు రూ.8.25 లక్షల నుండి రూ.10.44 లక్షల మధ్యలో ఉన్నాయి.
అలాగే ఫోర్డ్ అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) ఫోర్డ్ ఎండీవర్ ధర రూ.17.07 లక్షల నుండి రూ.20.13 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇవే కారణాల చేత త్వరలోనే ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








