మరో నాలుగేళ్లలో ఫోర్డ్ ఇండియా నుంచి 8 కొత్త మోడళ్లు

Ford Figo
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో 2015 నాటికి ఎనిమిది కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఫోర్డ్ ఇండియా ముద్దుల కారు "ఫోర్డ్ ఫిగో"పై భారత వినియోగదారులు చూపిస్తున్న ఆదరణ పట్ల కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఫిగో ఇప్పటికే కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌తో పాటు ఎన్నో దేశీయ ఆటోమొబైల్ అవార్డులను సొంతం చేసుకుని భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలోకి చేరిపోయింది.

ఫోర్డ్ ఇండియా 2011 సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైందనే చెప్పాలి. ఏడాది తొలి నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నెలవారీ విక్రయాలు (10,000 కార్లకు పైగా..) రికార్డు స్థాయిలోనమోదయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎనిమిది మోడళ్లను పరిచయం చేసే అంశంపై దృష్టి సారించామని ఫోర్డ్ ఇండియా ఉపాధ్యక్షుడు అనురాగ్ మెహరోత్రా వెల్లడించారు. దీంతోపాటు తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా దేశవ్యాప్తంగా విస్తరించుకోనున్నామని, ప్రస్తుతం ఉన్న 170 డీలర్లకు అదనంగా మరో 30 డీలర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

గతేడాది (2010)లో కంపెనీ 83,887 యూనిట్లను విక్రయించి 2009తో పోలిస్తే.. దాదాపు మూడింతల వృద్ధిని సాధించింది. 2009లో కంపెనీ కేవలం 29,488 కార్లను మాత్రమే విక్రయించింది. గత 15 ఏళ్లుగా కంపెనీ విక్రయాలలో ఇంత అధిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఫోర్డ్ ఇండియా 10,026 యూనిట్లకు విక్రయించగా.. 2010 జనవరిలో 2,453 యూనిట్లు మాత్రమే ఉన్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2011, 13:09 [IST]
English summary
Buoyed by encouraging customer response to 'Figo' and 'Endeavor' cars, Ford India will introduce eight more models by 2015, a senior executive of the auto major said today. The US-based carmaker started 2011 with its best-ever monthly sales performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+