ఫోర్డ్ కార్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం

Ford Midnight Offer
ఫోర్డ్ కంపెనీ కార్లను కొనాలనుకునే వారికి ఇదే అత్యంత అనువైన సమయం. ప్రస్తుతం పోర్డ్ ఇండియా డిసెంబర్ ధమాల్ అంటూ.. క్లియరెన్స్ సేల్‌ను ప్రారంభించింది. "మిడ్‌నైట్ సేల్" పేరుతో ఫోర్డ్ ఇండియా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి అర్థరాత్రి వరకూ (డిసెంబర్ 4వ తేదీ మాత్రమే) షోరూమ్‌లను తెరచి ఉంచి అమ్మకాలు సాగించనుంది.

అంతేకాదండోయ్.. ఫోర్డ్ ఇండియా అందిస్తున్న వివిధ కార్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* ఫోర్డ్ ఫిగో:
రూ.15,000 వరకూ సేవింగ్స్
డిస్కౌంట్ అనంతరం ధర రూ.3.71 లక్షలు

* ఫోర్డ్ గ్లోబల్ ఫియస్టా:

రూ.75,000 వరకూ సేవింగ్స్
డిస్కౌంట్ అనంతరం ధర రూ.7.50 లక్షలు

* ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్:

రూ.23,000 వరకూ సేవింగ్స్
డిస్కౌంట్ అనంతరం ధర రూ.5.50 లక్షలు

* ఫోర్డ్ ఎండీవియర్:

ఆకర్షనీయమైన 8.99 శాతం వడ్డీ రేటు
ప్రారంభ ధర రూ.17.07 లక్షలు

(ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ గ్లోబల్ ఫియస్టాలపై ఆఫర్లు కేవలం పెట్రోల్ వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. పైన పేర్కొన్న అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). డిసెంబర్ 4, 2011న ఈ మిడ్‌నైట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఆ రోజున ఫోర్డ్ కారును బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక తగ్గింపులతో పాటు, ఆకర్షనీయమైన వడ్డీ రేట్లు, సర్‌ప్రైజ్ బహుమతులు, లక్కీ డ్రా కూపన్లు లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం, రేపు ఫోర్డ్ షోరూమ్‌కి వెళ్లి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకునేందుకు సిద్ధంకండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 3, 2011, 12:23 [IST]
English summary
Ford India's “Midnight Sale” is back on 4th December 2011. Ford India has come up with great deals and discounts on their cars. Through this Midnight Sale Ford India dealers across India will be open from 8 AM in the morning up to midnight.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+