హాట్‌కేకుల్లా ఫిగో సేల్స్: అమ్మకాల్లో పదివేల మార్కును తాకిన ఫోర్డ్

Ford
కొత్త సంవత్సరంలో తొలి నెలలో ఫోర్డ్ ఇండియా శుభారంభం చేసింది. జనవరి 2011లో ఫోర్డ్ ఇండియా విక్రయాలు ఓ సరికొత్త మైలురాయిని తాకాయి. ఫోర్డ్ ఇండియా కంపెనీ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జనవరి విక్రయాలు 10,026 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి 2010తో పోలిస్తే జనవరి 2011లో సంస్థ విక్రయాలు 309 శాతం వృద్ధిని సాధించాయి. ఫోర్డ్ ఇండియాకు ఇదే అత్యధిక నెలసరి విక్రయాలు (హైయస్ట్ మంత్లీ సేల్స్). అంతకుముందు అత్యధిక నెలసరి విక్రయాల రికార్డు మార్చి 2010లో నమోదైంది. మార్చి 2010లో విక్రయాలు 9,478 యూనిట్లుగా ఉన్నాయి.

బహుళ అవార్డులను సొంతం చేసుకున్న ఫోర్డ్ ఫిగో విక్రయాలు కూడా ఈ నెలలో భారీ వృద్ధిని కనబరచాయి. జనవరి 2011లో ఫిగో విక్రయాలు ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి 8,600 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి 2010లో విడుదలైన ఫిగో ఒక్క నెలలో ఇంత అధిక సంఖ్యలో అమ్ముడుకావండ ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో నమోదైన ఈ విక్రయాలు ముందున్న కంపెనీ పురోభివృద్ధికి శుభసూచకాలని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మైఖేల్ బోన్‌హామ్ అన్నారు. 2010లో ఫోర్డ్ ఇండియా విక్రయాలు 83,887 యూనిట్లుగా ఉన్నాయి. కాగా వీటిలో ఒక్క ఫిగో విక్రయాలే 68,000 యూనిట్లకు పైగా ఉండటం విశేషం.

ఫిగో అవార్డుల పరంపర..:
ఫిగో 20 భారత ఆటో పరిశ్రమ అవార్డులను దక్కించుకొని బెస్ట్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో ఫిగో కూడా ఒకటి. భారత చరిత్రలోనే ఏ ఇతర కారుకు సాధించని విధంగా ఫిగో పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుందని బోన్‌హామ్ చెప్పారు.

ప్రముఖ ఆటోమోటివ్ మ్యాగజైన్ ఎడిటర్ల జ్యూరీ ప్యానల్‌ చేత ఫిగో "కార్ ఆఫ్ ది ఇయర్ 2011"గా ఎన్నికయింది. బ్లూంబర్గ్‌ యూటివి-ఆటోకార్ ఇండియా, ఈటి జిగ్‌వీల్స్, మోటార్‌బీమ్ డాట్ కామ్, టీమ్-బిహెచ్‌పి డాట్ కామ్‌ల నుంచి కూడా నాలుగు 'కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను ఫిగో సొంతం చేసుకుంది. ఇంకా.. 'స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్', 'కాంపాక్ట్ కార్ ఆఫ్ ది ఇయర్', 'డిజైన్ ఆఫ్ ది ఇయర్', 'వీవర్స్ ఛాయిస్ మరియు రీడర్స్ ఛాయిస్ అవార్డ్‌'లతో పాటు బ్లూంబర్గ్‌ యూటివి-ఆటోకార్ ఇండియా, మోటార్ వికటాన్ మ్యాగజైన్‌ల నుంచి 'మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను కూడా ఫిగో దక్కించుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2011, 7:54 [IST]
English summary
Ford India has started the New Year with its best monthly sales performance ever, with 10,026 units sold in the first month of 2011 a more than four-fold increase, against 2453 units sold over the same period last year. By reaching the 10,000-unit monthly sales milestone, Ford has surpassed its previous monthly record of 9,478, set in March 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+