ఫిగో విక్రయాలు జూమ్..: కేరళలో 'డిస్కవర్ స్మార్ట్ డ్రైవ్'

కాగా.. భారత్‌లో వేగంగా విక్రయం అవుతున్న రెండో కారుగా కూడా "ఫిగో" పేరు తెచ్చుకుంది. 2010 సంవత్సరంలో 83,887 ఫోర్డ్ ఫిగో కార్లు అమ్ముడయ్యాయి. 2009లో కేవలం 29,488 కార్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే 2009తో పోలిస్తే 2010లో విక్రయాలు మూడింతలకు పెరిగాయి. దీంతో విక్రయాలను మరింతగా పెంచుకునేందుకు కంపెనీ దృష్టి సారించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








