నవంబర్‌లో రానున్న కొత్త ఆటోమేటిక్ ఫోర్డ్ ఫియస్టా

New Ford Fiesta
ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో అందిస్తున్న ఫియస్టా సెడాన్‌లో గడచిన జులై నెలలో ఓ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఫియస్టాలో మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. రానున్న నవంబర్ నెల మధ్య భాగం నాటికి 2011 ఫియస్టాలో ఆటోమేటిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని ఫోర్డ్ సన్నాహాలు చేస్తుంది.

భారత మార్కెట్లో ఫోర్డ్ విడుదల చేస్తానని చెప్పిన ఎనిమిది కొత్త మోడళ్లలో సరికొత్త 2011 ఫోర్డ్ ఫియస్టా మొదటిది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభించే ఫోర్డ్ ఫియస్టా స్టైల్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో 2011 ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.8.23 లక్షల నుంచి రూ.9.42 లక్షల మధ్యలో ఉన్నాయి.

అలాగే, డీజిల్ వేరియంట్ 2011 ఫోర్డ్ ఫియస్టా ధరలు రూ.9.27 లక్షల నుంచి రూ.10.42 లక్షల (అన్నిధరలు కూడా ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. అయితే, ఫోర్డ్ ఆశించినంతగా కొత్త ఫియస్టా అమ్మకాలు సాగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అధిక ధర వెచ్చించి ఫియస్టాను కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ లభించకపోవడమే.

ఈ నేపథ్యంలో కొత్త ఫియస్టా సెడాన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను పరిచయం చేయాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం లభిస్తున్న మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ కలిగిన ఫియస్టాలో అన్ని వేరియంట్లు కూడా ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు స్టీరింగ్ వీల్ ఆడియో కంట్రోల్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో ఓ పరిమితి (స్టాండర్డ్ ఫీచర్)గా లభిస్తాయి.

ఇది 1.5 లీటర్ టిఐవిసిటి పెట్రోల్ ఇంజన్ 106.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు పెట్రోల్‌కు 17 కిలోమీటర్లను ఇస్తుంది. అలాగే, 1.5 లీటర్ 90 బిహెచ్‌పి డ్యురాటార్క్ డీజిల్ ఇంజన్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు డీజిల్‌కు 23.5 కిలోమీటర్లను ఇస్తుంది. మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు కొత్త హ్యుందాయ్ వెర్నా సెడాన్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2011, 17:05 [IST]
English summary
The recently launched all new 2011 Ford Fiesta, soon will come with an automatic version. The existing manual version 2011 Ford Fiesta comes with price range of Rs 8.23 to 9.42 lakh for the petrol variant and Rs 9.27 lakh to 10.42 lakh for the diesel, all prices ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+