ఐకాన్ విక్రయాలను నిలిపివేయనున్న ఫోర్డ్ ఇండియా..!

ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలంటే ఐకాన్ మోడల్‌కు స్వస్తిపలకక తప్పదని కంపెనీ అధ్యక్షుడు మైఖేల్ బోన్‌హామ్ పేర్కొన్నారు. ఫోర్డ్ ఐకాన్ కారు 1.3 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ వేరియంట్లలో రూ. 5 లక్షలు, రూ. 5.6 లక్షల ధరల మధ్య లభించేది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఐకాన్ విక్రయాలను ఫోర్డ్ నిలిపివేసింది. ఇప్పటి వరకూ (జనవరి 2011 చివరి వరకూ) కంపెనీ 1,34,000 ఐకాన్‌లను విక్రయించింది.


Click it and Unblock the Notifications








