విస్తరణ ప్రణాళికపై డైలమాలో పడిన ఫోర్డ్ ఇండియా

విడిభాగాల కొరత కారణంగా గత నెలలో ఫోర్డ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఫిగో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. గత నెలలో ఇవి 5,700 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ కోసం 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తానని చెప్పిన ఫోర్డ్‌కు, భవిష్యత్తులో పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కునే ఆస్కారం ఉంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు డీజిల్ మోడళ్లపై శ్రద్ధ చూపుతుండటంతో మార్కెట్లో ఒక్కసారిగా డీజిల్ వాహనాలకు డిమాండు ఊపందుకుంది. రెండవ ప్లాంటు ఏర్పాటు గురించి ఫోర్డ్ ఇప్పటికే, తమిళనాడు, గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపినప్పటికీ తుది నిర్ణయం తీసుకోవడంలో మాత్రం జాప్యం చేస్తోంది. కొత్త ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఫోర్డ్‌కు కనీసం 20 నెలల సమయం పట్టవచ్చు.


Click it and Unblock the Notifications








