ఫోర్డ్ - ఫెరారీ కంపెనీల మధ్య బ్రాండ్ వార్...!

Ford Ferrari
ఆటోమొబైల్ కంపెనీల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న కొత్త మోడళ్లతో ఆటో కంపెనీలు మరో పెద్ద తలనొప్పే ఎదురయ్యేలా ఉంది. ఆటో కంపెనీల ఉత్పత్తులు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవ్వలాంటే.. అన్నింటికన్నా ముఖ్యం బ్రాండ్ నేమ్. కానీ.. రొజుకో కొత్త మోడల్ విడుదలవుతున్న ఈ రోజుల్లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ నేమ్‌ను నిర్ణయించడంలో సమస్యలు ఎదుర్కుంటున్నాయి. మరికొన్ని కంపెనీలయితే బ్రాండ్ నేమ్‌ నెపంతో ఒకరినొకరు దూషించుకోవడం కూడా మొదలుపెట్టాయి. ఈ కోవలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్, ప్రముఖ రేస్ కార్ల తయారీ సంస్థ ఫెరారీలు బ్రాండ్ వార్‌ను ప్రారంభించాయి.

ఇటలీకు చెందిన స్పోర్ట్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లఘించిందని ఫోర్డ్ మోటార్ ఆరోపించింది. ఫెరారీ ఉత్పత్తి చేసి కారుకు "ఎఫ్ 150" అనే పేరును పెట్టడంతో ఈ వివాదం ప్రారంభమైంది. వాస్తవానికి ఫోర్డ్ మోటార్ కంపెనీ "ఎఫ్-150" బ్రాండ్ పేరుతో పిక్-అప్ ట్రక్కులను రూపొందిస్తుంది. కానీ ఈ పేరును ఫెరారీ వాడుకోవడంతో.. ఫెరారీపై ఫోర్డ్ మోటార్ విమర్శల వర్షం కురిపించింది.

అయితే ఫెరారీ కూడా ఈ విమర్శలపై కొంచెం ఘాటుగానే స్పందించింది. ఇటీవల ఇటలీ దేశం జరుపుకున్న "150వ ఇటలీ యూనిఫికేషన్" (ఒక సామాజిక ఉద్యమం)ను ఆధారంగా చేసుకొని తమ ఎఫ్ సిరీస్‌లో వస్తున్న రేస్‌ కార్లకు ఈ బ్రాండ్‌ను పెట్టడం జరిగిందని వివరణ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆటో కంపెనీలు తమ కొత్త ఉత్పత్తుల కన్నా ముందు బ్రాండ్ నేమ్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2011, 8:19 [IST]
English summary
The car makers are at will to install a brand name for their products and take advantage from its reach to the market. This is very acute in the US market where the brand is of most important. Recent episode involving Ford Motor suing Ferrari on the issue of brand naming has caused much spark in the auto industry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+