ఫోర్డ్ సరికొత్త ప్రచారం: వారం రోజుల పాటు కార్లను ఫ్రీగా వాడుకోవచ్చు

ఈ ప్రచారంలో భాగంగా, ప్రస్తుతం ఏదైనా కారును ఉపయోగిస్తున్న వారికి, తమ వద్ద అదే రేంజ్‌లో ఉండే ఓ కారును వారం రోజుల పాటు ఉచితంగా వాడుకోమని ఫోర్డ్ ఆఫర్ చేస్తుంది. ఇలా వారం రోజుల్లో వినియోగదారులు తమ వద్ద ఉన్న కారు నడపటానికి మరియు ఫోర్డ్ ఆఫర్ చేసిన కారును నడపటానికి వ్యత్యాసాన్ని గమనించి తమ అభిప్రాయాలను ఫోర్డ్‌తో పంచుకుంటున్నారు.
ఉదాహరణకు మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును వాడే వారికి ఫోర్డ్ ఫిగో కారును, టాటా ఇండిగో కారును వాడే వారికి ఫియస్టా క్లాసిక్ కారును మరియు టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని వాడే వారికి ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని ఫోర్డ్ అందిస్తుంది. ఈ క్యాంపైన్‌లో పాల్గొన్న వారు తెలిపే అభిప్రాయాలను ఫోర్డ్ తన ప్రకటనల్లో ప్రచురిస్తుంది.
ఫోర్డ్ అభిప్రాయం ప్రకారం, ఇది తమపోటీదారులను తక్కువ చేసి చూపించడం కాదని, ఇతర కంపెనీల వాహనాలను ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ వాహనాలను ఒక వారం రోజుల పాటు ఉపయోంగించినప్పుడు సదరు వినియోగదారుడు ఆ రెండింటికీ మధ్య అనుభవాన్ని తెలియజెప్పే ప్రయత్నేమనని ఫోర్డ్ అంటోంది.


Click it and Unblock the Notifications








