క్రూయూజ్ కంట్రోల్‌తో కూడిన తొలి ఫియస్టా విడుదల

నాలుగు డోర్లు కలిగిన ఈ ప్రిమీయం సెడాన్ టిఐ-వీసీటీ (Ti-VCT) పెట్రోల్ ఇంజన్, టీడీసీఐ (TDCi) డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అంతే కాకుండా ఇది క్రూయూజ్ కంట్రోల్ సిస్టమ్ (ఆటోమేటిక్‌గా స్పీడ్‌ను నియంత్రించే వ్యవస్థ)తో లభిస్తుంది. ఈ విభాగంలో క్రూయూజ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఫోర్డ్ పటిష్టతకు ఫియస్టా మరింత బలాన్ని చేకూర్చుతుందని, తమ వాహనాలు భద్రత, నాణ్యత, ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు పెట్టింది పేరని ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ చెప్పారు.


Click it and Unblock the Notifications








