డీజిల్ స్విఫ్ట్ కోసం నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్!!

New Maruti Swift
మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ బుకింగ్‌లు తారాజువ్వలా నింగికెగుస్తుండటంతో సదరు కారును సొంతం చేసుకోవాలంటే కొనుగోలుదారులు మరింత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కొత్త స్విఫ్ట్ విడుదల కోసం పాత స్విఫ్ట్ ఉత్పత్తిని రెండు నెలల క్రితమే నిలిపివేయడంతో పాటు కొత్త స్విఫ్ట్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ మోడల్‌ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మరోవైపు ప్రస్తుతం దేశీయ కొనుగోలుదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల భయంతో డీజిల్ కార్లపై మక్కువ చూపుతుండటంతో కొత్త స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. మార్కెట్ సమాచారం ప్రకారం దీని వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉంది.

అయితే, పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ మాత్రం రెండు నుంచి మూడు నెలల్లో డెలవరీ అవుతోంది. భారతదేశపు ఆటోమొబైల్ చరిత్రలోనే ఏ కారు కూడా కొత్త స్విఫ్ట్‌ మాదిరిగా విడుదలకు ముందే ఇంత భారీస్థాయి సంఖ్యలో బుకింగ్‌లు కాలేదు. కొత్త స్విఫ్ట్‌కు ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్‌లు రాగా.. అందులో 80 శాతం డీజిల్ వేరియంట్లే ఉన్నట్లు మారుతి సుజుకి పేర్కొంది. అయితే, కంపెనీ వెయింటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు భారీ కసరత్తులే చేస్తోంది. ఇందులో భాగంగానే హంగేరీకు డీజిల్ ఇంజన్‌ల ఎగుమతిని కనిష్ట స్థాయికి తగ్గించడంతో పాటు ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2011, 13:11 [IST]
English summary
The new Maruti Suzuki Swift has received a huge response from car buyers. We were wondering what the waiting period of the new swift would be. Recent reports say the diesel Swift's waiting period at some showrooms has crossed four months. Maruti Suzuki has said about 80 per cent of the new Swift's bookings was diesel. Even the petrol variant of the Swift is now commanding a waiting period of two to three months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+