లీటరుకు 30 కిలోమీటర్ల మైలేజినిచ్చే బజాజ్ ఫోర్-వీలర్

ప్రస్తుతం తాము లీటర్‌కు 30 కిలోమీటర్ల మైలేజినిచ్చే విధంగా తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా ఓ ఫోర్‌వీలర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇది మోటార్‌సైకిల్/త్రీ-వీలర్ ప్రతిభ నుంచి పుట్టుకొచ్చినదని, ఇది ఓ ప్రైవేట్ వాహనంగా మరియు ఓ టాక్సీలాగా రెండు విధాలుగా ఉపయోగపడగలదని రాజీవ్ చెప్పారు. ఈ ఫోర్-వీలర్‌ను ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఔరంగాబాద్ ప్లాంటులో కంపెనీ త్రీ-వీలర్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.
బజాజ్ కంపెనీ ఇప్పటికే.. రీనాల్ట్, నిస్సాన్ కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టాటా నానోకు పోటీగా ఓ బుజ్జి కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని రాజీవ్‌తో ప్రస్తావించగా.. ఈ జాయింట్ వెంచర్‌కు తమ పోర్-వీలర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా బజాజ్ ఆటో వ్యక్తిగత ప్రాజెక్ట్ అని, ఈ ప్రోడక్ట్ అభివృద్ధి, తయారీ బాధ్యతలు పూర్తిగా 100 శాతం తమదేనని ఆయన చెప్పారు. 2012 నాటికి ఇది రోడ్లపై సంచరిందను రాజీవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








