భారత్‌లో ఫ్రీల్యాండర్ కారు అసెంబ్లింగ్‌కు టాటా ప్రయత్నాలు

Freelander SUV
ల్యాండ్ రోవర్‌కు చెందిన లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) "ఫ్రీల్యాండర్"ను భారత్‌లో అసెంబ్లింగ్ చేయాలని భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ కారను నేరుగా బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడం కన్నా.. విడిభాగాలను మాత్రమే సికెడిలుగా దిగుమతి చేసుకుని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే పన్ను రాయితీలు పొందవచ్చునని కంపెనీ యోచిస్తోంది. పూణేకు సమీపంలో ఉన్న చిఖ్లీ ప్లాంటులో ఏడాది 2,000 కార్ల చొప్పున అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది, ఇందుకోసం చిఖ్లీ ప్లాంటును టాటా మోటార్స్ అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ ఏడాది నుంచే ఫ్రీల్యాండర్ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను టాటా చేపట్టనుంది.

ఒక్క ఏడాది కాలంలోనే భారత మార్కెట్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకొని టాటా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్రీల్యాండర్ వెర్షన్ ఇకపై భారత్‌లోనే లభించనుందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఇప్పటి వరకూ టాటా మోటార్స్ 200 ల్యాండ్ రోవర్ మోడళ్లను విక్రయించింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ షేర్‌ను, మార్జిన్లు పెంచుకోవడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ల్యాండ్ రోవర్ ఉత్పత్తులకు చైనా తర్వాత భారత మార్కెటే తమకు అత్యంత పటిష్టమైన మార్కెట్ అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2011, 11:24 [IST]
English summary
In a bid to capitalize on the import duty exemption, Tata Motors is planning to assemble the SUV Freelander in the Indian facility. The Chikhli plant will be upgraded to assemble nearly 2000 units per year and incidentally this facility was employed earlier by Mercedes-Benz. Tata Motors will start assembling the cars this year, imported as CKD from Jaguar and Land Rover of the UK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+