ఈ టాటా నానో ఖరీదు జస్ట్ రూ.22 కోట్లు మాత్రమే..

భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టాటా గ్రూపుకు చెందిన టైటాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కారును రూపొందించింది. దీని తయారీకి 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. దీని తయారీకి సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ముంబైలో జరిగిన టైటాన్ ఇండస్ట్రీస్ సంస్థ రజతోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఓ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ బంగారు నానో కారును ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 29 టాటా గోల్డ్ ప్లస్ ఔట్‌లెట్లలో ఈ గోల్డ్ నానోను ప్రదర్శించనున్నారు.


Click it and Unblock the Notifications








