ఇంధనం లీక్ సమస్య: 1500 సివిక్ కార్లను రీకాల్ చేసిన హోండా

అమెరికాలో మొత్తం 1,156 సివిక్ కార్లను రీకాల్ చేయబడ్డాయి. గురువారం హోండా కెనడా మరో 377 సివిక్ కార్లను రీకాల్ చేసింది. ఏప్రిల్ 21 నుంచి మే 2 మధ్య కాలంలో అసెంబ్లింగ్ చేసిన సివిక్ కార్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయి. 17 శాతం అమెరికా వాహనాల్లో లోపాలున్నాయని హోండా తెలిపింది. అయితే హోండా కెనడా మాత్రం ఇలాంటి లోపం ఉన్న రెండు కార్లు మాత్రమే వినియోగదారులకు అమ్ముడయ్యాయని పేర్కొంది. వచ్చే వారం చివరి నాటికి ఈ తాజా రీకాల్ గురించి హోండా వినియోగదారులకు సమాచారం అందించనుంది. హోండా డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈ లోపాన్ని తనిఖీ చేసి అవసరమైతే ఫ్యూయెల్ ఫీడ్ లైన్లను ఉచితంగా మార్చడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








