అరటి, అనాస పండ్లతో కార్ల తయారీ..: బ్రెజిల్ శాస్త్రవేత్తల ప్రయోగం

Future Cars
అరటి పండు, అనాసపండు (పైనాపిల్)లతో ఏంచేస్తాం..? అదేం ప్రశ్న వీటితో మహా అయితే ఫ్రూట్ సలాడ్‌లు, లేదా ఫ్రూట్ జ్యూసులు చేసుకుంటాం అంటారా...! మన దేశంలో అయితే ఇలా చేస్తారేమో కానీ బ్రెజిల్ మాత్రంలో వీటితో కార్లను తయారు చేస్తారు. కార్లంటే తినే కార్లో లేక బొమ్మ కార్లో కాదండోయ్.. రోడ్డుపై రయ్.. రయ్.. అంటూ దూసుకుపోయే నిజమైన కార్లు. భావితరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించిన పదార్థాలను తయారు చేస్తున్న దశలో.. బ్రెజిల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అరటిపండు, అనాసపండ్లతో పాటు మరికొన్ని చెట్ల నుంచి సేకరించే ఫైబర్‌ (ఒకరకమైన ధృఢమైన ప్లాస్టిక్ పదార్థం)ను కార్ల తయారీకి ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నానోసెల్యులోజ్‌గా పిలువబడే ఈ ఫైబర్ తక్కువ బరువును కలిగి ఉండి అధిక ధృడత్వాన్ని ఇస్తుంది. ఈ పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఎల్సిడిస్‌ లియో మాట్లాడుతూ ఫైబర్‌ను రేయిన్‌ఫోర్స్‌గా వినియోగిస్తారని, తాము అభివృద్ధి చేస్తున్న ప్లాస్టిక్స్‌ను అరటి, పైనాపిల్ వంటి పండ్ల నుండి తయారు చేస్తారని చెప్పారు. ఈ ప్లాస్టిక్స్ వేడి, గ్యాసోలైన్, నీరు వంటి వాటిని తట్టుకోగలదని, కారు డ్యాష్‌బోర్డ్స్, బంపర్స్, కొన్ని బాడీ ప్యానెల్స్ తయారీకి ఈ ఫైబర్‌ను ఉపయోగించవచ్చునని ఆయన చెప్పారు.

రానున్న రెండేళ్లలో ఈ ఫైబర్‌ను కార్ల తయారీకు ఉపయోగించనున్నామని వారు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాన్ని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఎసీఎస్‌) 241వ జాతీయ సమావేశాలు, ప్రతిపాదనల సందర్భంగా లియో వివరించారు.

More from DriveSpark

Article Published On: Monday, April 11, 2011, 12:52 [IST]
English summary
Scientists in Brazil have developed a way of using fibers from bananas, pineapples and other plants to create plastic that is stronger and lighter than the petroleum-based stuff. So-called nanocellulose fibers rival Kevlar in strength but are renewable, and the researchers says this plastic sholud be used in car manufacuring within a couple of years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+