పెట్రోల్ అయిపోయిందా.. అయినా కంగారు పడకండి.: మెక్‌కార్ ఉందిగా..!

చైనాకు చెందిన గీలే అనే ఆటోమొబైల్ సంస్థ పర్యావరణానికి హాని కలిగించని వాహనల అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగానే 'మెక్‌కార్' అనే ఈ కాంబో కార్ + స్కూటర్‌ను రూపొందించింది. గత నెల షాంగైలో జరిగిన ఆటో షోలో కంపెనీ ఈ కారును ప్రదర్శించింది. ఇది పూర్తిగా హైబ్రిడ్ వెర్షన్ (ఇంధనం + బ్యాటరీ పవర్)లో కానీ, లేదా పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కానీ లభిస్తుంది. టూ-డోర్, ఫోర్ సీటర్ సామర్థ్యం కలిగిన ఈ కారు వెనుక భాగంలో మూడు చక్రాలుండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మడతపెట్టి సర్దేసుకోవచ్చు. అవసరమైనప్పుడు బయటకు తీసుకొని వాడుకోవచ్చు. అంతేకాదండోయ్.. కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చార్జ్ చేసుకోవచ్చు. బాగుంది కదా ఈ కాంబో కార్.. ఇంధన ధరలు మండుతున్న నేటి రోజుల్లో ఈ కార్లు మనదేశానికి కూడా వస్తే ఎంత బావుంటుందో..!


Click it and Unblock the Notifications








