డీజిల్ కార్ల పోర్ట్‌ఫోలియో పెంపుపై జనరల్ మోటార్స్ కన్ను

Chevrolet Spark
పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా డీజిల్‌తో నడిచే కార్లకు డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో అమెరికా అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్‌కు చెందిన భారత అనుబంధ సంస్థ జనరల్ మోటార్స్‌ ఇండియా (జిఎమ్ఐ) దేశీయ మార్కెట్లో అందిస్తున్న మోడళ్లలో మరిన్ని డీజిల్ వేరియంట్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ అందిస్తున్న కాంపాక్ట్ కారు బీట్‌లో డీజిల్ వేరియంట్‌ను ప్రస్తుత నెలలో విడుదల చేయాలని జనరల్ మోటార్స్ భావిస్తోంది. దీంతో పాటుగా ఇతర మోడళ్లలో కూడా ఇదేవిధమైన వేరియంట్లను పరిచయం చేయాలని నిర్ణయించింది.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డీజిల్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టడానికి ఎల్లప్పుడూ సాధ్యాసాధ్యాలు ఉంటాయని జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు. తమ చిన్న కారు స్పార్క్‌ మోడల్‌లోనూ అలాగే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏవియో యూవీఏ మరియు ఎంట్రీ లెవల్ సెడాన్ ఏవియో మోడళ్లలోనూ డీజిల్ ఆప్షన్‌ను పరిచయం చేస్తారా అన్ని ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇతర సెగ్మెంట్లలలో డీజిల్ ఇంజన్‌ను పెట్టాలనే ఆశక్తి ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏవియో యూవిఏ కేవలం పెట్రోల్ వేరియంట్‌లో లభిస్తుండగా ఏవియో సెడాన్ మాత్రం పెట్రోల్ మరియు సిఎన్‌జీ ఆప్షన్లతో లభిస్తోంది.

పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనానికి ధరల మధ్య తేడా లీటరుకు దాదాపు రూ. 26 ఉండటం వల్ల డీజిల్ కార్లకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోందని స్లిమ్ తెలిపారు. డీజిల్ వాహనాల డిమాండును తీర్చేందుకు తాలేగావ్‌లోని ఇంజన్ ప్లాంటులో ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఈ ప్లాంటు సామర్థ్యం సాలీనా 1.6 లక్షల యూనిట్లు, పెరుగుతున్న అవసరాలను ఈ ప్లాంటు అందుకోగలదు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తమకు పెద్ద విషయం కాదని ఈ ప్లాంటు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లను హ్యాండిల్ చేయగలదని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2011, 16:58 [IST]
English summary
US auto major General Motor's Indian arm General Motors India (GMI) is looking to expand its range of diesel-driven cars as demand for the variant increases due to the price difference with petrol.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+