ధరల పెంపుపై అక్టోబర్ నాటికి నిర్ణయం: జనరల్ మోటార్స్

Beat
జనరల్ మోటార్స్ ఇండియా వచ్చే నెలలో తన ఉత్పత్తుల ధరలను సమీక్షించనున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల పెంపువైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో జనరల్ మోటార్స్ ఇండియా కూడా ప్రస్తుత నెలలో తమ ఉత్పత్తుల ధరల తీరును సమీక్షించి అక్టోబర్ నాటికి ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని జిఎమ్ ఇండియా అధ్యక్షుడు, ఎమ్‌డి కార్ల్ స్లిమ్ చెప్పారు.

కాగా.. అక్టోబర్ 1 నుంచి తమ అన్ని రకాల ఉత్పత్తులపై 2 శాతం వరకూ ధరలను పెంచనున్నట్లు టొయెటా కిర్లోస్కర్ మోటార్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. "అక్టోబర్ 1 నుండి ధరలను 1.5 శాతం నుండి 2 శాతం మేర పెంచుతాం. పెరుగుతున్న విడిభాగాల ధరలు మరియు యెన్ (జపాన్ కరెన్సీ) విలువ పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు.

మరోవైపు తమ అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ ప్రకటించారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 10, 2011, 11:19 [IST]
English summary
General Motors India hinted price hike of its products in September. GM India President, MD Karl Slym said "After reviewing the prices of our vehicle this month we may decide on price hike by October".
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+