అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ (జిఎమ్) ఇండియా భారత్‌లో మరో ఐదు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. వీటిలో ఎక్కువగా డీజిల్ మోడళ్లు ఉండనున్నాయి. భారత్‌లోని చిన్న కారు విభాగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న జనరల్ మోటార్స్ రానున్న 18 నెలల్లో ఓ హ్యాచ్‌బ్యాక్, తవేరా (యూరో-4), యుటిలిటీ వెహికిల్, సెడాన్‌తో కలిపి ఐదు కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
బెంగుళూరులో చెవర్లే బీట్ డీజిల్ కారును విడుదల చేసిన అనంతరం జిఎమ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ మాట్లాడుతూ.. 2012 మధ్య భాగం నాటికి ఐదు కొత్త మోడళ్లను 14 వేరియంట్లలో విడుదల చేయనున్నామని చెప్పారు. అలాగే, భారతీయ రోడ్లకు అనుగుణంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లను కూడా తమ బృందం అభివద్ధి చేస్తోందని ఆయన తెలిపారు.