చిన్న మార్కెట్లు, పెద్ద ప్రయోజనాలు: జనరల్ మోటార్స్

"చిన్న పట్టణాల్లో, (మార్కెట్) మందగమనం చాలా తక్కువగా ఉంటుంది, అక్కడ ఉండే ప్రజలు ఎక్కువగా కార్ లోన్లపై ఆధారపడరు. ఈ ఏడాదిలో మంచి వర్షాభావ పరిస్థితులతో భారత్‌లోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో సౌకర్యంగా ఉంటార"ని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరం ఇటువంటి ప్రాంతాల్లో 50 కొత్త అవుట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం జనరల్ మోటార్స్‌కు భారత్‌లో 250 సేల్స్ అవుట్‌లెట్లు ఉన్నాయి.
"రెండేళ్ల క్రితం, మెట్రోల నుంచి 60 శాతం అమ్మకాలు ఉండగా, మెట్రయేతర ప్రాంతాల నుంచి 40 శాతం అమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ గణాలు తిరగబడ్డాయి. ప్రస్తుతం చిన్న పట్టణాల్లోకి ప్రవేశించడం ద్వారా ఈ మార్కెట్ల నుంచి అమ్మకాలు 70 శాతానికి పెరగగలవని మేము అంచనా వేస్తున్నాం" అని కార్ల్ స్లిమ్ చెప్పారు. ప్రస్తుతం 1.4 లక్షల వాహనాలను విక్రయించగలని జనరల్ మోటార్స్ భావిస్తోంది. గతేడాదిలో కంపెనీ 1.1 లక్షల వాహనాలను విక్రయించింది.


Click it and Unblock the Notifications








