పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన జిఎమ్

జనరల్ మోటార్స్ వద్ద ఇప్పటికే అధిక మొత్తంలో పెట్రోల్ కార్లు స్టాక్‌లో ఉన్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌లో జిఎమ్ డీలర్లు పెట్రోల్ కార్లను విక్రయించేందుకు సతమవుతున్నారు. ఉత్పత్తి మార్పు ప్రక్రియను జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు పి. బాలేంద్రన్ స్పష్టం చేశారు. కంపెనీ ఇటీవల విడుదల చేసిన బీట్ డీజిల్ కారుకు మార్కెట్లో గిరాకీ బాగా పెరిగింది. అయితే, పెట్రోల్ బీట్ కార్లకు మాత్రం డిమాండు గణనీయంగా తగ్గిపోయింది.
ఫలితంగా పెట్రోల్ కార్ల స్టాక్‌ను తగ్గించుకునేందుకు చెవర్లే డీలర్లు పెట్రోల్ కార్లపై వివిధ ప్రోత్సాహకాలను కూడా ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో విడుదలైన డీజిల్ కార్లు, పెట్రోల్ కార్ల కన్నా అధికంగా అమ్ముడువుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 80 శాతం మంది కొనుగోలుదారులు డీజిల్ కార్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్ల కంపెనీ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ కార్లను విడుదల చేయడం కన్నా వాయిదా వేయడం మంచిదని భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








