రూ. 4.99 లక్షలకే మహీంద్రా & మహీంద్రా మిని ట్రక్ 'జినియో'

జినియోలో ఏర్పాటు చేసిన ఇంజన్, గేర్ సిస్టమ్‌లు సాధారణ కార్ల మాదిరిగానే సౌకర్యంగా ఉంటాయని, ఈ వాహనాల ఉత్పత్తి కోసం రూ. 200-225 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఆయన తెలిపారు. పికప్ వాహనాల సెగ్మెంట్లో ఎమ్ అండ్ ఎమ్ 75 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. జినియో నెక్స్ట్ లెవల్ ట్రక్ అని, గడచిన రెండేళ్లుగా ఈ విభాగంలో కొత్త ఉత్పత్తులు రాలేదని ఆయన తెలిపారు. 2010లో ట్రక్ సెగ్మెంట్ కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే సాధించిందని, కానీ ఈ ఏడాది రెండింతల వృద్ధిని సాధించగలమని పవన్ గియోన్కా ఆశాభావం వ్యక్తం చేశారు.
డైమండ్ వైట్, మార్వెల్ గ్రానైట్, సిల్వర్ షైన్ (మెటాలిక్), స్కైలైన్ బ్లూ అనే నాలుగు రంగులలో జినియో లభ్యమవుతుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 2010) నుంచి దేశవ్యాప్తంగా మహీంద్రా అండ్ మహీంద్రాకు ఉన్న 70 మంది డీలర్ల ద్వారా జినియో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. బీఎస్3 వెర్షన్ కన్నా రూ. 15,000 అధిక ధరతో కంపెనీ బీఎస్4 వెర్షన్ వాణిజ్య వాహనాన్ని కూడా మహీంద్రా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








