ఆటో రంగంలో టెక్నాలజీని పంచేందుకు సిద్ధంగా ఉన్నాం: జర్మనీ

Auto Sector
భారతదేశ ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విదేశీ కంపెనీలతో పాటు, విదేశీ ప్రజాప్రతినిధులు కూడా భారత్‌లోని అవకాశాలను అంచనా వేసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీకు చెంది రవాణా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పీటర్ రామ్‌సౌర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్‌కు చేరుకున్నారు. రామ్‌సౌర్‌తో పాటు ఓ ఉన్నతస్థాయి వాణిజ్య బృందం కూడా భారత్‌కు చేరుకుంది. ఇక్కడ ఆటోమోటివ్ సెక్టార్‌పై జరగనున్న ఇండో-జెర్మన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జెడబ్ల్యూజి) సైడ్‌లైన్స్‌లో రామ్‌సౌర్ సారథ్యంలో వచ్చిన ఓ ఉన్నత స్థాయి బృందం భారత భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌తో భేటీ కానున్నారు.

సమర్థవంతమైన ఆటోమోటివ్ సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి వంటి విషయాల్లో ఇండో-జెర్మన్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ బృందం దృష్టి సారిస్తుంది. లాజిస్టిక్స్‌లో జర్మనీ ప్రపంచ ఛాంపియన్ అని, అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలోనూ, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగంలో ఎనర్జీ-ఎఫిషియంట్ టెక్నాలజీలోనూ జర్మనీ ప్రపంచ లీడర్ అని, భారత్‌లోని తమ భాగస్వాములతో ఈ టెక్నాలజీలను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామ్‌సౌర్ అన్నారు. జర్మనీకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని, తన పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ విభాగాల్లో సహకారం మరింత పటిష్టం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, April 18, 2011, 15:58 [IST]
English summary
German transport, building and urban development minister Peter Ramsauer is in India with a business delegation team for a three-day visit from Monday to Wednesday. Ramsauer, accompanied by a high-level business delegation, will meet Minister for Heavy Industries Praful Patel on the sidelines of the Indo-German Joint Working Group (JWG) on Automotive Sector.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+