మే దెబ్బకు దిగొచ్చిన కంపెనీలు.. కార్లపై భారీ డిస్కౌంట్లు..!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ముద్దుల కారు ఆల్టోపై కంపెనీ భారీ సేవింగ్స్‌ను అందిస్తోంది. ఆల్టో మోడల్‌పై రూ. 41,000, ఆల్టో కె10 మోడల్‌పై రూ. 25,000 సేవింగ్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే చెవర్లే అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ డీజిల్‌పై రూ. 21,000 ప్రోత్సాహకాలను అందిస్తోంది. టాటా మోటార్స్ కూడా అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్ల రేంజ్‌ను ప్రకటనలుగా ఇస్తూ వాటిపై సరసమైన వడ్డీ ధరను మరియు తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. విస్టా క్వాడ్రాజెట్‌పై రూ. 35,000, ఇండిగో ఇసిఎస్‌పై రూ. 33,000, ఇండిగో మాంజాపై రూ. 45,000 తగ్గింపును ఆఫర్ చేస్తుంది.
అలాగే ఫియట్ కూడా ఫ్యూయెల్ ఎఫీషియంట్ కార్లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. ఫియట్ పుంటో, లీనియా మోడళ్లపై రూ. 40,000 వరకూ తగ్గింపులను అందిస్తోంది. ఫియట్ పుంటో డీజిల్ ధర రూ. 5.26 లక్షలుగా ఉండగా, లీనియా ధర 7.56 లక్షలుగా ఉంది. చాలా వరకూ ఆటో కంపెనీలు ఈనెల (జూన్) ఈ ఆఫర్‌లను అందిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే మే నెలలో ఆటోమొబైల్ మార్కెట్‌పై పడిన ప్రతికూల ప్రభావాలను దృష్టి ఉంచుకొని విక్రయాలకు ఊతమిచ్చేందుకు కంపెనీలు డిస్కౌంట్ పాట అందుకున్నాయి. ఏదేతైనే ఇది వినియోగదారులకు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








