వంద వసంతాలు పూర్తి చేసుకున్న చెవర్లే బ్రాండ్

పది దశాబ్ధాలుగా ఎంతో ప్రజాభిమాన్ని సంపాధించుకున్న చెవర్లే బ్రాండ్ అటు అమెరికా మార్కెట్లోనే కాకుండా ఇటు ప్రపంచ మార్కెట్లలో సైతం తన హవాను కొనసాగిస్తు గట్టి మార్కెట్ పోటీని తట్టుకుంటూ ముందుకు సాగిపోతుంది. చెవర్లే బ్రాండ్‌ను 1911లో స్థాపించడం జరిగింది. ఇది 1914లో విస్తృత స్థాయి ఉత్పత్తులను అందించడం ప్రారంభించింది.
అప్పట్లో 2-సీటర్ రాయల్ మెయిల్, ఫోర్-సీటర్ గ్రాండ్‌లు అత్యంత ప్రాచుర్యాన్ని సంపాధించి పెట్టడమే కాకుండా ఆటోమొబైల్ రంగంలో కొత్త విప్లవాలకు తెరలేపాయి. 1932లో చెవర్లే 'రోడ్‌స్టర్'ను పరిచయం చేసింది. బహుశా ఇది ఆ సమయంలో ఆకర్షనీయ ధరలో లభ్యమవుతున్న అత్యంత విలసవంతమైన కారు అయి ఉండొచ్చు.
ఈ శతాబ్ధ కాలంగా చెవర్లే ఏ తరానికి చెందిన వారి అభిరుచులకు అనుగుణంగా, ఎప్పటి కప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సరికొత్త ఉత్పత్తులను అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ వస్తోంది. చెవర్లే కీర్తి ఇలాగే చిరకాలం శోభాయమానంగా వెలుగొందుతూనే ఉండాలని మనమూ కోరుకుంటా.. చెవర్లే బ్రాండ్‌కు అభినందనలు తెలుపుకుందాం.


Click it and Unblock the Notifications








