కొత్త ఉత్పత్తులు, సామర్థ్యాల పెంపు కోసం జిఎమ్ తాజా పెట్టుబడులు

GM Chevrolet Beat
అమెరికా అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ భారతీయ అనుబంధ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా, తాలేగావ్ ప్లాంటులో తాజాగా రూ. 400-600 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనున్నట్లు పేర్కొంది. తాజా పెట్టుబడులను తాలేగావ్ ప్లాంటులో కార్లు మరియు ఇంజన్‌ల ఉత్పత్తిని పెంచుకునేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడి వల్ల ప్లాంటు సామర్థ్యం పెరిగి సెడాన్ వేరియంట్ మోడళ్లను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఈ ఏడాదిలో కార్, ఇంజన్ ప్లాంట్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపుగా రెండింతలకు (మూడు లక్షల యూనిట్లకు) పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ వివరించింది.

వచ్చే రెండేళ్లలో తాలేగావ్ ప్లాంటులో తాము పెట్టబోయే కొత్త పెట్టుబడులతో కంపెనీ మొత్తం పెట్టుబడులు రూ. 2,200 కోట్లకు పైగా చేరుతాయని, తాజా పెట్టుబడులను కొత్త ఉత్పత్తుల కార్యకలాపాలకు మరియు మార్కెట్ డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా (జిఎమ్ఐ) వైస్-ప్రెసిడెంట్ (కార్పోరేట్ ఆఫైర్స్) పి బాలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తాలేగావ్ ప్లాంటులో జిఎమ్ రూ. 1,800 కోట్ల పెట్టుబడులను వెచ్చించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1.4 లక్షల కార్లను మరియు 1.6 లక్షల పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ప్లాంటులో కంపెనీ అందిస్తున్న చిన్న కార్లయిన చెవర్లే బీట్, స్పార్క్ వంటి మోడళ్లు కూడా తయారవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2011, 12:58 [IST]
English summary
US major carmaker General Motors Indian unit General Motors India (GMI) would launch a variety of new model over the next two years with fresh additional investment of Rs 400-600 crore at its Talegaon car and engine manufacturing facility.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+