డీజిల్ బీట్ ధరను రూ.15,000 పెంచిన జనరల్ మోటార్స్

అయితే, సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇతర వేరియంట్ల బీట్ ధరలను పెంచకుండా కేవలం డీజిల్ వేరియంట్ బీట్ ధరను మాత్రమే జనరల్ మోటార్స్ పెంచింది. అంతేకాకుండా రానున్న జనవరి నెలలో తమ ఇతర ఉత్పత్తుల ధరలను కూడా 1-2 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది.
నిరంతరం పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, రూపాయి విలువ ఒడిదుడుకుల కారణంగా, ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి.బాలేంద్రన్ తెలిపారు. ఇప్పటికే చెవర్లే బీట్ మోడల్‌ను తగ్గింపు (డిస్కౌంట్) ధరకే అందిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్ కింద స్పార్క్, బీట్, ఏవియో, ఆప్ట్రా, క్రూజ్, తవేరా, క్యాప్టివా, యూవీఏ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. రెండు రోజుల క్రితమే, తమ ఉత్పత్తుల ధరల కూడా జనవరి నెల నుండి 1-3 శాతం మేర పెంచనున్నట్లు టొయోటా కిర్లోస్కర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








