రెండోసారి ధరల పెంపుకు సిద్ధమైన జనరల్ మోటార్స్..!

GM India
జనరల్ మోటార్స్ వాహనాల కొనుగోలుదారులకు మరో చేదు వార్త. మీరు జనరల్ మోటార్స్ కారును కొనాలుకున్నట్లయితే.. ఈ నెలలోనే కొనుక్కోవడం ఉత్తమం. మరొక్క నెల ఆలస్యం చేసినట్లయితే.. మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అనుబంధ సంస్థ "జనరల్ మోటార్స్ ఇండియా" ఈ ఏడాది వరుసుగా రెండోసారి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ముడి సరుకుల రేట్లు పెరగడం ఇలాగే కొనసాగినట్లయితే.. మరోసారి తమ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి. బాలేంద్రన్ తెలిపారు.

నానాటికీ పెరుగుతున్న ఇన్‌పుచ్ కాస్ట్ పట్ల ఆటోమొబైల్ తయారీదారులకు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఈ నెలాఖరు నాటికి ముడి సరుకుల ధరల పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, వచ్చే నెల మొదట్లో ఓ నిర్ణయం తీసుకుంటామని బాలేంద్రన్ చెప్పారు. ఈ ఏడాదిలోనే తమ లగ్జరీ కారు "క్యాడిలాక్‌"ను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. జనరల్ మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో తమ కార్ల ధరలను 2 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత మార్కెట్లో జనరల్ మోటార్స్ నుంచి స్పార్క్‌, ఏవియో యూవీఏ, ఏవియో, ఓప్ట్రా, తవేరా, కాప్టివా, క్రూజ్‌, బీట్‌ వంటి ఎనిమిది బ్రాండ్లను విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2011, 9:52 [IST]
English summary
The Indian arm of the American auto major General Motors is likely to increase prices for the second time this year to offset surging raw material costs. General Motors India Vice-President P Balendran said company may consider increasing prices again for the second time this year if prices of raw materials continue to increase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+