భారత్‌లో ఆరు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న జిఎమ్

అలాగే రానున్న రెండేళ్ళలో మరో ఆరు కొత్త మోడళ్లతో, ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న మోడళ్లలో కూడా కొత్త వేరియంట్లను విడుదల చేయనున్నామని, వీటిల్లో రెండు లైట్ కమర్షియల్ వాహనాలుంటాయని స్లిమ్ తెలిపారు. మిగిలిన వాటిలో నాలుగు ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్, సెడాన్‌లు ఉంటాయని ఆయన తెలిపారు. ఇందుకోసం కంపెనీ 500 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా వెచ్చించనుంది. జనరల్ మోటార్స్ తొలుత "ఓపెల్" బ్రాండ్‌తో భారత్‌లోకి ప్రవేశించింది. కానీ తర్వాత దాని స్థానంలో చెవెర్లెట్ వచ్చి చేరింది. భారత్‌కు ఓపెల్ బ్రాండ్ సూటవ్వదని స్లిమ్ చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చెవర్లెట్ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనున్నామని, దీన్ని బెంగళూరులోని ప్లాంటులో అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. ఈ కారును మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేయనున్నారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. 2012లో రెండు లక్షలు, 2013లో మూడు లక్షల కార్లను విక్రయించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చెవర్లెట్ బ్రాండ్ కారణంగా ప్రస్తుతం 'జిఎమ్ ఇండియా' ఐదవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది.
ప్రస్తుతం భారత్‌లో చెవర్లెట్ బ్రాండ్ పేరిట 8 వేరియంట్లను జనరల్ మోటార్స్ అందిస్తుంది. స్పార్క్, ఏవియో యూవీఏ, ఏవియో, ఓప్ట్రా, తవేరా, కాప్టివా, క్రూజ్‌లతో పాటు తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ కారు బీట్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. 2010లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 7.4 సెకన్లకు ఒక జిఎమ్ కారు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. 1902లో కాడిలాక్ బ్రాండ్ పేరిట తొలి కారును ఆవిష్కరించగా, ప్రస్తుతం 39 దేశాల్లో ఈ కారు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ. 60-70 లక్షల మేర ఉండవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








