ఈ ఏడాది చివరి నాటికి తవేరాలో యూరో-4 వెర్షన్

Chevrolet Tavera
ప్రపంచపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ దేశీయ మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న మల్టీ యుటిలిటీ వాహనం (ఎమ్‌యూవీ) తవేరాలో మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేయనుంది. ఈ విభాగంలో టొయోటా అందిస్తున్నఇన్నోవాకు పోటీగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రవేశపెట్టిన తవేరా గడచిన కొద్ది కాలంగా తన మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తవేరా ఎమ్‌యూవీకు పునఃజ్జీవం కల్పించాలని జనరల్ మోటార్స్ నిర్ణయించింది.

ఈ ఏడాది చివరి నాటికి తవేరా - యూరో4 వెర్షన్ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి.బాలేంద్రన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 ప్రధాన నగరాల్లో ఈ మోడల్‌ అందుబాటులో ఉండేలా కంపెనీ చర్యలు తీసుకోనుంది. కొత్త తవేరాలో ప్రధానంగా ఇంజన్‌ మారనుంది. ఇందుకోసం కంపెనీ తన వద్ద ఉన్న డీజిల్ ఇంజన్‌లతో పాటు ఇతర సంస్థల నుంచి అధునాతన ఇంజన్లను సైతం జనరల్ మోటార్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే, దాదాపుగా కొత్త తవేరా యూరో-4 వెర్షన్‌లో 2-లీ. సీఆర్‌డీఐ డీజిల్‌ ఇంజిన్‌‌ను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గడచిన నెల(జులై)లో కంపెనీ మొత్తం 9,580 వాహనాలను విక్రయిస్తే, అందులో 1,707 తవేరా వాహనాలు ఉండగా, 5,255 యూనిట్లు బీట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, 1,502 యూనిట్లు స్పార్క్ కార్లు ఉన్నాయి. ఇంకా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యూవీఏ 62 యూనిట్లు, ఎంట్రీ లెవల్ సెడాన్ ఏవియో 125 యూనిట్లు, మిడ్-సైజ్ సెడాన్ ఆప్ట్రా 123 యూనిట్లు, లగ్జరీ సెడాన్ క్రూజ్ 621 యూనిట్లు, ఎస్‌యూవీ కాప్టివా 113 యూనిట్లు అమ్ముడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 15:33 [IST]
English summary
General Motors India Vice-President Mr P. Balendran said that, the Company will launch a Euro IV version of its Multi-Purpose Vehicle (MPV) Tavera by the end of this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+