జైపూర్ మార్కెట్లో చెవర్లే బీట్ డీజిల్‌ను విడుదస చేసిన జిఎమ్

చెవర్లే బీట్ మోడల్ ఇప్పటికే పెట్రోల్ మరియు ఎల్‌పిజి వెర్షన్లలో లభిస్తుంది. అత్యంత మార్కెట్ ఆదరణ పొందిటిన బీట్ పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే బీట్ డీజిల్ వేరియంట్‌కు కూడా మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. డీజిల్ బీట్‌లో 936 సీసీ, 3-సిలిండర్, 1.0 లీటర్ ఎక్స్ఎస్‌డిఈ స్మార్టెక్ (XSDE SMARTECH) కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను ప్రత్యేకించి భారత్ కోసం మాత్రమే చెవర్లే అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ 58.5 పిఎస్‌ల శక్తిని మరియు 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను కలిగి ఉంటుంది. ఇంజన్ రన్నింగ్ చాలా స్మూత్‌గా ఉండి బెస్ట్ మైలేజ్‌ను ఇస్తుంది. ఐదు మ్యాన్యువల్ గేర్లు కలిగిన బీట్ డీజిల్ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీని మైలేజ్ లీటరు డీజిల్‌కు 24 కి.మీ.


Click it and Unblock the Notifications








