జిఎమ్ నుంచి తొలి ఫ్రంట్ సెంటర్ ఎయిర్ బ్యాగ్

సాధారణంగా కార్లలో ఫ్రంట్ సీట్‌లో డ్రైవర్‌కు, ప్యాసింజర్‌కు ముందువైపు, పక్కవైపు (కారు అద్దం వైపు) ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అకస్మాత్తుగా ప్రమాదం సంభవించినప్పుడు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ విచ్చుకొని డ్రైవర్, ప్యాసింజర్ కారు డ్యాష్‌బోర్డుకు గుద్దుకోకుండా రక్షిస్తాయి. అలాగే సైడ్ ఎయిర్ బ్యాగ్స్ పగిలిన అద్దాల నుండి రక్షిస్తాయి.
కానీ.. కారులో ఈ సెంటర్ ఎయిర్ బ్యాగ్ ఉండటం వలన ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్, డ్రైవర్ ఒకరికొకరు పక్కవైపు నుండి ఢీకొట్టుకోకుండా ఉండటానికి ఉపకరిస్తుంది. ఫలితంగా ప్రమాద తీవ్రత తగ్గుతుంది. 2013 మోడల్ ఇయర్ బుయిక్ ఎన్‌క్లేవ్, జిఎమ్‌సి అకాడియా మరియు చెవర్లే ట్రావెర్స్ మోడళ్లలో ఈ ఫ్రంట్ సెంటర్ ఎయిర్ బ్యాగ్‌ను పరిచయం చేయనున్నారు.


Click it and Unblock the Notifications








