నెల రోజలకు చేరుకున్న కార్మికుల సమ్మె.. దిగిరాని యాజమాన్యం

General Motors
జనరల్ మోటార్స్ యాజమాన్యానికి కార్మికులకు మధ్య తలెత్తిన వివాదం నెల రోజులకు చేరుకుంది. కొంతమంది ఉద్యోగులను డీలర్‌షిప్ అవుట్‌లెట్లకు బదిలీ చేయడానికి నిరసనగా, అలాగే గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన దీర్ఘకాలిక వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 16న గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న జనరల్ మోటార్స్ ఇండియా ఫ్యాక్టరీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజులపాటు జరిగిన ఈ సమ్మె కారణంగా కంపెనీ ఇప్పటివరకూ 1,500 యూనిట్లు ఉత్పత్తిని నష్టపోయింది.

గత కొద్ది కాలంగా యాజమాన్యానికి వర్కర్లకు మధ్య జరుగుతున్న చర్చలు విఫలమతూనే వస్తున్నాయి. సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వర్కర్లను యాజమాన్యం బెదింరించినప్పటికీ కూడా వర్కర్లు స్పందించడం లేదని కంపెనీ తెలిపింది. అయితే ఈ విషయంపై త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ చెప్పారు. 200 మంది వర్కర్లు ఇంకా విధుల్లోకి రాలేదని, వారు వడోదరాలో ధర్నా చేస్తున్నారని సమ్మె చేయని వర్కర్ల గ్రూపుకు చెందిన వర్గాలు వెల్లడించాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 16, 2011, 14:46 [IST]
English summary
The ongoing unrest among the labors of the General Motors plant in Halol continues after a month and the estimated loss is 1500 units a month. With the bilateral talks between the company and the striking labors could not yield any sign of compromise, the company has gone to the extent of threatening the employees to lose their jobs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+