జులై 25న మార్కెట్లోకి రానున్న డీజిల్ బీట్!

Beat Diesel
జనరల్ మోటార్స్ చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 'బీట్' ఇకపై డీజిల్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది. అమెరికా ఆటో దిగ్గజం కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తున్న బీట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఇప్పటి వరకూ పెట్రోల్ వేరియంట్లో లభిస్తున్న బీట్‌లో డీజిల్ వేరియంట్‌ను కూడా వచ్చే సోమవారం కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జులై 25న డీజిల్ బీట్‌ను ఇండియాలో విడుదల చేయనున్నామని జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు.

స్మార్టెక్ ఇంజన్‌తో లభించే కొత్త డీజిల్ బీట్ మంచి ఫెర్ఫామెన్స్‌ను ఇవ్వనుంది. డీజిల్ బీట్ ఇంజన్ యొక్క నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్ష్‌నెస్ (ఎన్‌వీహెచ్) చాలా తక్కువగా ఉంటుందని, ఇది అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ కారు ధరను మరియు ఇతర వివరాలను విడుదల రోజున మాత్రమే వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.

అంతేకాదు ఇంధన సామర్థ్యంలో కూడా బీట్ తన సత్తా చాటనుంది. డీజిల్ బీట్ లీటరకు 24 కి.మీ. మైలేజ్‌ను ఇవ్వవచ్చునని అంచనా. అంటే.. ప్రస్తుతం టాటా ఇండికా ఈవీ-2 ఇస్తున్న మైలేజ్‌ (25kmpl)కు ఇది దాదాపు సమానంగా ఉండబోతుందన్నమాట. ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సోమవారం వరకూ ఆగక తప్పదు మరి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 17:41 [IST]
English summary
GM India has finally confirmed the launch of the diesel Beat by launching its official website. The new Beat is powered by a Smartech engine that Chevrolet claims will deliver improved performance. The carmaker has also said the diesel Beat engine's noise, vibrations and harshness (NVH) was considerably lower and will provide a better driving experience.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+