ఇండియాలో అయితే బీట్.. అదే అమెరికాలో అయితే స్పార్క్..

అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో జనరల్ మోటార్స్ అతి తక్కువ ధరకు ఈ చిన్న కారును అక్కడి మార్కెట్లో విడుదల చేయడం గమనార్హం. అమెరికాలో విడుదలైన ఈ కొత్త చెవర్లే స్పార్క్ 1-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో-చార్జ్‌డ్ పెట్రోల్ ఇమజన్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లోని బీట్ కారులో ఉపయోగించిన డీజిల్ ఇంజన్‌నే అమెరికా మార్కెట్లోని స్పార్క్ కారులో ఉపయోగించారు. కొత్త చెవర్లే స్పార్క్ (అమెరికా)లో ఫ్రంట్, రియర్ బంపర్‌లను రీడిజైన్ చేశారు.
ప్రస్తుతం భారత్‌లో లభ్యమయ్యే బీట్ గ్రిల్ కన్నా విశాలమైన గ్రిల్‌ను స్పార్క్‌లో ఉపయోగించారు. హెడ్‌లైట్స్, టైల్ లెట్ల డిజైన్‌లో చిన్నపాటి మార్పులు, రీస్టైల్ చేయబడిన స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ మరియు ఇంటీరియర్లలో కూడా మార్పులు చేశారు. భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు జనరల్ మోటార్స్ తప్పనిసరిగా ఈ కొత్త స్పార్క్‌ను దేశీయ విపణిలోకి ఫేస్‌లిఫ్ట్ బీట్‌గా తీసుకువచ్చే అవకాశం ఉంది. అంటే, రెండేళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించిన బీట్ త్వరలో ఓ కొత్త రూపు సంతరించుకోనుందన్నమాట.


Click it and Unblock the Notifications








