సునామీ దెబ్బకు నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన టొయోటా

అయితే... మిగిలిన త్రైమాసికాలలో కూడా ఆటో పరిశ్రమ విక్రయాలు ఇదే స్థాయిలో కొనసాగినా లేదా మరింత పెరిగినట్లయినా, టయోటా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థాయికి చేరనట్లయితే అమెరికా ఆటో అగ్రగామి జనరల్ మోటార్స్ ఉత్పత్తి, విక్రయాలలో టయోటాను అధిగమించి కార్ల తయారీలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోగలదని వారు భావిస్తున్నారు. కాగా.. 2007లో జనరల్ మోటర్స్ కంపెనీని టొయోటా అధిగమించి కార్ల తయారీలో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి ఎదిగింది.
జపాన్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టొయోటా అధ్యక్షుడు అకియో టొయోడా మాట్లాడుతూ.. విడిభాగాల కొరత వల్ల ఏర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు ఆయన అపాలజీ చెప్పారు. తమ వాహన కొనాలని నిర్ణయించుకున్న వినియోగదారులకు సదరు వాహన డెలివరీలో జాప్యం జరిగినట్లయితే క్షమించాల్సిందిగా ఆయన వినియోగదారులను కోరారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ప్లాంట్ల ద్వారా 50 శాతం ఉత్పత్తిని, ఉత్తర అమెరికాలో ఉన్న ప్లాంట్ల ద్వారా 30 శాతం ఉత్పత్తిని సాధిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








