త్వరలో ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్‌ను విడుదల చేయనున్న జిఎమ్

అలాగే, ఎక్స్టీరియర్లలో కూడా చిన్నపాటి మార్పులు కనబడనున్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొద్దిగా మార్పు చేయబడిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టీ రియర్ స్పాయిలర్ వంటి మార్పులు ఫేస్‌లిఫ్ట్‌లో చెవర్లే బీట్‌లో దర్శనమివ్వనున్నాయి. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే.. బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌సిడి స్క్రీన్, కొత్త ప్లాస్టిక్ మెటీరియల్స్, ఆప్షనల్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.
ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ బీట్ 80 బిహెచ్‌పిల శక్తిని, 108 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగా.. డీజిల్ వేరియంట్ బీట్ 57 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ బీట్ డీజిల్ వేరియంట్ కూడా 24 కి.మీ. పైగానే మైలేజ్‌ను ఇవ్వనుంది. ఇక ధర విషయానికి వస్తే రూ.4.29 లక్షల నుండి రూ.5.45 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








