సమ్మె చేసినప్పటికీ వర్కర్లకు పదోన్నతి కల్పించిన జిఎమ్

General Motors
గుజరాత్‌లోని వడోదరాలో ఉన్న జనరల్ మోటార్స్ హలోల్ ప్లాంటులో గతంలో కార్మికులు సమ్మె చేసి కంపెనీకు నష్టం కలిగించినా, కేవలం వారు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు కార్మికులకు కంపెనీ పదోన్నతిని (ప్రమోట్) కల్పించింది. జనరల్ మోటార్స్ హలోల్ ప్లాంటులో దాదాపు 900 మంది పర్మినెంట్ వర్కర్లు పనిచేస్తుండగా.. ఈ ఏడాది వారిలో 383 మంది కార్మికులకు కంపెనీ పదోన్నతి కల్పించింది. మరికొందరు వర్కర్లు కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే వారికి ఉత్పత్తి సంబంధం ఉండదు.

కాంట్రాక్ట్ వర్కర్లు హౌస్‌-కీపింగ్ మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తారు. గడచిన సంవత్సర కాలంలో హలోల్ ప్లాంటులోని కార్మికులు రెండుసార్లు సమ్మెకు దిగారు. అయితే, ప్లాంటులో కార్మికులకు యాజమాన్యానికి మధ్య సహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు మరియు తమ ప్లాంటు మరో మారుతి సుజుకిలా మారకుండా ఉండేందు కోసం ముందస్తు జాగ్రత్తగా కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో జనరల్ మోటార్స్ మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్ కోసం తయారు చేయాలని భావిస్తుంది, సదరు ఉత్పత్తుల విజయానికి కార్మికులు కూడా కీలకం కావడంతో కార్మిక ప్రయోజానలపై జనరల్ మోటార్స్ దృష్టి సారించింది.

More from DriveSpark

Article Published On: Monday, June 20, 2011, 16:56 [IST]
English summary
General Motors has promoted as many as 383 workers at its Halol plant in Gujarat. This promotions have come as a surprise as the Halol plant had seen two instances of strikes in the past one year. General Motors currently has 900 permanent employees and few contractual workers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+