ఉత్తర అమెరికాలో 50,500 జీఎమ్ క్యాడిలాక్ కార్ల రీకాల్

2011 మోడల్‌కు చెందిన క్యాడిలాక్ ఎస్ఆర్ఎక్స్ లగ్జరీ క్రాసోవర్ వాహనాలు ఈ రీకాల్‌కు వర్తించననున్నట్లు జనరల్ మోటార్స్ పేర్కొంది. అయితే ఈ సమస్యకు సంబంధించి యాక్సిడెంట్లు, గాయాల పాలైనట్లు ఇంత వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదుల అందలేదని కంపెనీ తెలిపింది. జనరల్ మోటార్స్ అందిస్తున్న ఎస్ఆర్ఎక్స్ సెడాన్ కారు కాడిలాక్ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అయితే ఇదేం అంత పెద్ద సమస్య కాదని, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చిన్న మార్పు చేస్తే సరిపోతుందని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








