చెవర్లే బ్రాండ్ పేరుతో చైనా వ్యాన్‌లు భారత్‌లోకి..!

భారత్‌లో ఉన్న చెవర్లే డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ వ్యాన్లను విక్రయించాలని జనరల్ మోటార్స్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో చిన్న తరహా వాణిజ్య వాహన మార్కెట్ కొంచెం పెద్దది కావడం మరియు ఈ విభాగంలోనికి ప్రవేశించడానికి జనరల్ మోటార్స్ వద్ద ఉత్పత్తులు లేకపోవడం మూలాన చైనాలో తయారైన మినీ వ్యాన్‌లను చెవర్లే బ్రాండ్‌లో భారత్‌లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తుంది. మరోవైపు చెవర్లే బ్రాండ్ కింద ఎస్‌జిఎమ్‌డబ్ల్యూ ఉత్పత్తులు ఉండటం వలన ఈ విభాగంలో ఉన్న అవకాశాలను దక్కించుకునేందుకు జనరల్ మోటార్స్‌కు చక్కని అవకాశం లభించినట్లయిందని సీన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో చైనాలో తయారైన 'హోంగా గువాంగ్' అనే ఓ సెవన్ సీటర్ మినీ వ్యాన్‌కు చెవర్లే బ్యాడ్జ్‌ను అంటించి జనరల్ మోటార్స్ భారత్‌లోకి తీసుకురానుంది. ప్రస్తుతం చైనాలో ఈ మినీ వ్యాన్ 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది.


Click it and Unblock the Notifications








