గోల్డ్ ప్లస్ నానో కారుతో టాటా నానోకు ఫ్రీ పబ్లిసిటీ..

ఈ నేపథ్యంలో "టాటా నానో"పై కొనుగోలుదారు పెద్దగా ఆసక్తి చూపకపోతుండటంతో ఎలాగైనా నానో అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ వివిధ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా గతంలో టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఉద్యోగులకు రతన్ టాటా సంతకంతో కూడిన ఓ స్పెషల్ ఎడిషన్ టాటా నానో కారును డిజైన్ చేసి దానిపై రూ.25,000 (టాప్ఎండ్ వేరియంట్)పై డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది.
కాగా.. ఇప్పుడు తాజాగా.. టాటా గ్రూప్ షేర్ హోల్డర్లకు కూడా ఈ ఆఫర్‌ను వర్తింపజేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. టాటా గ్రూపుకు సుమారు 3.5 లక్షల మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. మరోవైపు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు బంగారం, వెండి వజ్రాలతో రూపొందించిన ఓ టాటా నానో కారును రతన్ టాటా ఇటీవలే ఆవిష్కరించారు. దీని తయారీకు సుమారు రూ.22 కోట్లు ఖర్చు అయింది. లక్షల రూపాయల కారు కాస్త కోట్ల విలువ చేసే కారుగా మారడంతో అందరూ టాటా నానోపై ఓ లుక్కేశారు. దీంతో టాటా నానో కారుకు ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లయింది.


Click it and Unblock the Notifications








